Digestive Tablets: మోతాదు మించి తీసుకుంటే చాలా ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త

Digestive Tablets: ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం లేదా ఇతర కారణాలతో జీర్ణం కాక గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది డైజెస్టివ్ ట్యాబ్లెట్లు తీసుకుంటుంటారు. ప్రతి చిన్న దానికీ ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ఆరోగ్యానికి హాని చేకూరుతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2023, 06:14 PM IST
Digestive Tablets: మోతాదు మించి తీసుకుంటే చాలా ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త

Digestive Tablets: ఇండియాలో తిండి ప్రియులెక్కువ. పార్టీలు, పెళ్లిళ్లలో తినే ఆహారంపై నియంత్రణ ఉండదు. ఆ తరువాత తిన్నది అరిగించుకునేందుకు డైజెస్టివ్ ట్యాబ్లెట్లు అలవాటు చేసుకుంటారు. మోతాదుకు మించి డైజెస్టివ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై, మందులపై నియంత్రణ అవసరం. ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్లు తీసుకోవడం మంచిది కాదు. డెజెస్టివ్ ట్యాబ్లెట్స్ మోతాదు మించి తీసుకుంటే ఆరోగ్యం కచ్చితంగా పాడవుతుంది.

అదే పనిగా డైజెస్టివ్ ట్యాబ్లెట్లు వాడుతుంటే శరీరం కూడా వాటికి అలవాటు పడిపోతుంది. అవి లేకపోతే జీర్ణం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఓ రకంగా డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. తినే ఆహారం ట్యాబ్లెట్ల సహాయంతో జీర్ణం చేసుకునే పరిస్థితి వస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. 

సాధారణంగా అందరూ డైజెస్టివ్ ట్యాబ్లెట్లను జీర్ణ క్రియ మెరుగుపర్చేందుకు వాడుతుంటారు. కానీ రోజూ అదే పనిగా తింటుంటే అజీర్తి, గ్యాస్, అల్సర్ వంటి చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే సాధ్యమైనంతవరకూ సహజసిద్ధంగా జీర్ణమయ్యే విధంగా ప్రయత్నించాలి. 

డైజెస్టివ్ ట్యాబ్లెట్లు అతిగా తీసుకుంటే జీర్ణప్రక్రియలో సైతం మార్పు వచ్చేస్తుంది. ఆహారం సహజ పద్ధతిలో జీర్ణ కాకపోవడంతో న్యూట్రిషన్ల లోపం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శరీరంలో న్యూట్రిషన్లు లోపిస్తాయో బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

వైద్యుని సలహా లేకుండా అదే పనిగా డైజెస్టివ్ ట్యాబ్లెట్లు వాడుతుంటే శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు పేరుకుపోయే ప్రమాదముంది. అంటే వ్యర్ధ పదార్ధాలు పూర్తిగా బయటకు రావు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

మోతాదుకు మించి డైజెస్టివ్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా మనిషి క్రమక్రమంగా బలహీనమైపోతాడు. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. 

Also read: Rid Of Back Pain: వెన్ను నొప్పులను చాక్లెట్‌తో కూడా తగ్గించుకోవచ్చు..ఎలాగో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News