Heart Attack Signs: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో అయితే ఈ సమస్య మరింత పెరిగింది. చిన్నారులు, టీనేజ్ ఇలా అందర్నీ పొట్టనబెట్టుకుంటోంది. ఈ పరిస్థితికి కారణమేంటి, ఎలా రక్షించుకోవాలనేది పరిశీలిద్దాం.
ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చుని చేసే పని, పని ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇదంతా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు కారణం ఇదే. గుండెపోటు వచ్చినప్పుడు ధమనుల్లో అంతరాయం ఏర్పడి గుండెకు రక్త సరఫరా ఆగిపోవచ్చు. దీనికి కారణం కొలెస్ట్రాల్ కావచ్చు. కొలెస్ట్రాల్ కారణంగా రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది.
శరీరంలో హార్మోన్లు, విటమిన్ డి సంగ్రహణకు కొలెస్ట్రాల్ అవసరముంటుంది. కానీ ఇదే కొలెస్ట్రాల్ ఎక్కువైతే హాని కలుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది ధమని గోడలకు పేరుకుంటుంది. దీనివల్ల ప్లక్స్ ఏర్పడతాయి. ఇవి ధమనుల్ని బ్లాక్ చేస్తుంటాయి. దాంతో గుండెకు రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా కొలెస్ట్రాల్ నియంత్రించాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తుండాలి. శరీరంలో ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ వర్సెస్ గుడ్ కొలెస్ట్రాల్‌ను బట్టే గుండె ఎంతవరకూ ఆరోగ్యంగా ఉందో తెలుస్తుంది. ఎల్‌డీఎల్ పరిమాణం 100 కంటే తక్కువ ఉండాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ 130 దాటితే అదిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.
గుండె వ్యాధుల్నించి కాపాడుకునందుకు ఈ పదార్ధాలకు దూరం
ఫ్యాట్ ఎక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులు, కుకీస్, కేక్, బేకరీ పదార్ధాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఇందులో ఉప్పు ఇతర ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. బీఫ్, మటన్ తినకూడదు లేదా తగ్గించేయాలి. ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్, ఆయిలీ పదార్ధాలు ముట్టకూడదు.
గుండె వ్యాధుల లక్షణాలు
ఛాతీలో నొప్పి, ఛాతీ పట్టినట్టుండటం, అలసట, కడుపులో మంట, అజీర్తి, చెమట్లు పట్టడం, భుజాలు, మెడ, వీపు, జబ్బలు, కడుపు కింది భాగంలో నొప్పి ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. తల తిరగడం లేదా మైకం కమ్మడం ఉంటుంది.
Also read: High Blood Sugar: అధిక బ్లడ్ షుగర్‌కు సాంకేతికాలు ఇవే..మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heart Attack Signs: గుండె పోటు నుంచి ఎలా కాపాడుకోవాలి, లక్షణాలెలా ఉంటాయి