Hair Loss: How To Stop Hair Fall At Home: జుట్టు పలుచగా మారడం అనేది ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మహిళలతో పాటు మగవారు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఒత్తిడి, హార్మోన్లు, హెయిర్ డై, ఓవర్ స్టైలింగ్, డిప్రెషన్ మరియు పౌష్టికాహార లోపం లాంటి అంశాల వల్ల జుట్టు పలుచగా అవుతుంది. మరికొందరు తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమ జడ పొడవుగా అవడం లేదని ఆందోళన చెందుతుంటారు.
పురుషులు బట్టతల, లేక హెయిల్ ఫాల్ సమస్యతో మానసికంగా అనారోగ్యానికి లోనవుతుంటారు. తలస్నానం చేయాలంటే సైతం కొందరు భయపడుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఆడవారైనా, మగవారైనా కొన్ని విలువైన చిట్కాలు పాటిస్తే సరి. ఇంటి వద్దనే ఈ చిట్కాలు పాటించి మీ జట్టు రాలడం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: Benefits Of Pranayama: ప్రాణాయామం చేస్తే ఈ సమస్యలు పరార్
గుడ్డు మరియు పాలు
గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీ తల వెంట్రుకలకు పోషణ అందించే అమైనో ఆమ్లాలు లభించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మీ జుట్టుకు ప్రకాశాన్ని సైతం ఇస్తాయి. తలకు గుడ్డు(Benefits Of Egg) పేస్టుగా చేసుకుని రాసుకోవాలి. లేకపోతే గుడ్డు, పాలు కలిపిన మిశ్రమాన్ని కూడా జుట్టుకు రాసుకోవాలి. ఓ అరగంట తరువాత తలస్నానం చేయాలి. మీ తల వెంట్రుక గట్టిపడుతుంది. జుట్టు పటిష్టంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
పెరుగు మరియు ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్
జుట్టు దెబ్బతినడం మరియు బట్టతల సమస్యకు పెరుగు చెక్ పెడుతుంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. లేదంటే ఆలివ్ నూనె, పెరుగును కప్పులో వేసి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరువాత తలస్నానం చేయాలి.
Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
అవోకాడో మరియు మోరింగ హెయిర్ మాస్క్
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతౌల్యం ఒకటి. మోరింగ ఆకులు హార్మోన్ల అసమతౌల్యత మరియు విటమిన్ లోపాలను సరిదిద్దుతుంది. అవోకాడోలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, నియాసిన్, ఐరన్, విటమిన్ బి, మరియు విటమిన్ సి అధికంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్, తేనేను కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు మర్దన చేయాలి. 10 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేస్తే కుదుళ్లు గట్టిపడతాయి.
Also Read: Phone In Toilet: మొబైల్‌ను టాయిలెట్‌లో వాడుతున్నారా.. అయితే ఇది చదవండి
ఉల్లిపాయ మరియు కొబ్బరి నూనెతో ప్రయోజనం
కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ప్లేమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసాన్ని మిశ్రమంగా చేసుకుని తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే జట్టు పటిష్టంగా మారుతుంది.
మెంతులు మరియు పెరుగు హెయిర్ మాస్క్
వంటగదిలో లభించే మెంతులు మీ జుట్టుకు గొప్ప వరం లాంటివి. మెంతులులో ఇనుము మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఈ రెండూ జుట్టు రాలకుండా ఉండేందుకు తోడ్పడతాయి.
Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook