How To Reduce Cholesterol With Carrot Juice: ప్రస్తుతం గుండెపోటు అనేది చాలామందిలో సైలెంట్ గా వస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో ఎక్కువ మోతాదులో చెడు కొవ్వు పేరుకుపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలామందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయని వారంటున్నారు.
శరీరంలో అధిక మోతాదులో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెపోటు సమస్యలే కాకుండా.. చాలా మందిలో మధుమేహం, యూరిక్ యాసిడ్, అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరంలో కొలెస్ట్రాలను కరిగించుకోవడానికి ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన కొన్ని ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు వీటిని వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గించుకోవడానికి వ్యాయామాలు కూడా ఎంతో తోడ్పడతాయి. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా వాకింగ్ తో పాటు నలభై నిమిషాల పాటు వ్యాయామాలు కూడా చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరం అవుతాయని వారంటున్నారు.
బరువు, శరీరంలోని కొలెస్ట్రాల నియంత్రించుకోవడానికి క్యారెట్ రసం ప్రభావంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
క్యారెట్ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ రసాన్ని ఉదయాన్నే తాగడం వల్ల రక్తపోటు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఓ నెల తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి