Irregular Heartbeat: హార్ట్ బీట్ అసాధారణంగా ఉందా, గుండెపోటు ముప్పు నుంచి ఎలా విముక్తి పొందాలి

Irregular Heartbeat: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందర్నీ వెంటాడుతున్నాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. అందుకే ఏ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2023, 09:38 PM IST
Irregular Heartbeat: హార్ట్ బీట్ అసాధారణంగా ఉందా, గుండెపోటు ముప్పు నుంచి ఎలా విముక్తి పొందాలి

Irregular Heartbeat: మనిషి జీవితంలో అత్యంత విలువైంది గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. ఒకసారి గుండె ఆగిందంటే ఇక ఆ మనిషి ప్రాణం పోయినట్టే. గుండెకు సంబంధించిన చాలా రకాల చిన్న చిన్న సమస్యల్ని సాధారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

గుండె చప్పుడు అంటే హార్ట్ బీట్ సక్రమంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే అంటే అసాధారణంగా ఉంటే గుండె పోటు ముప్పు వెంటాడుతుంది. గుండె చప్పుడు అసాధారణంగా ఉంటే దానిని ఎరిథ్మియా అంటారు. ఈ పరిస్థితిలో గుండె చాలా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకుంటుంది. గుండె ఎలక్ట్రికల్ వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. చాలా సందర్భాల్లో అసాధారణ హార్ట్ బీట్ అనేది ఏ విధమైన ముప్పు లేకుండానే ఉంటుంది. కానీ తరచూ అదే విధంగా ఉండే ప్రమాదకరం కావచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజువారీ అలవాట్లను మార్చుకోవల్సి ఉంటుంది. 

ప్రతి రోజూ కావల్సినంత నిద్ర తప్పకుండా ఉండాలి. ఎవరైనా సరే రోజుకు 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. రోజూ తగినంత నిద్ర లేకుంటే స్లీప్ సైకిల్ మొత్తం చెడిపోతుంది. ఫలితంగా గుండె చప్పుడు అసాదారణంగా మారిపోతుంది. 

రోజూ ఆధునిక తరహాలో వ్యాయామం చేస్తుంటే గుండెకు బలం చేకూరడమే కాకుండా గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. రోజుకు 30-60 నిమిషాలు వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ చాలావరకూ తగ్గిపోతుంది. జిమ్ కాకపోయినా కనీసం వాకింగ్, మెట్లెక్కడం వంటివి అలవాటు చేసుకోవాలి. 

ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండాలి. మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచకపోతే కష్టమౌతుంది. అందుకే ఏ విషయంలోనూ టెన్షన్ పడటం మంచిది కాదు. ఒత్తిడికి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం ఎంతగా చేసినా డైట్ సరిగ్గా లేకుంటే అనారోగ్యం పెరిగిపోతుంది. బ్యాలెన్సింగ్ డైట్ అవసరం. అప్పుడే హార్ట్ బీట్ సరిగ్గా ఉంటుంది. ఆయిల్, సాల్ట్, ఫ్రైడ్, ఫ్యాట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Also read: Weight Loss In 9 Days: అల్లంతో 9 రోజులు బరువు తగ్గే చిట్కా ఇదే..తెలిస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News