Milk Tea Impact: టీ అతిగా తాగడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలే కాకుండా చర్మ సంరక్షణకు మంచిది కాదంటారు. టా తాగడం వల్ల చర్మం రంగు నల్లగా మారవచ్చు. టీ అదేపనిగా తాగడం వల్ల నిజంగానే చర్మం రంగు మారుతుందా, చర్మం నల్లబడుతుందా ,నిజానిజాలేంటో చూద్దాం
టీ అతిగా తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎలానూ పడుతుంది. అదే సమయంలో చర్మం రంగు మారుతుందనే వాదన ఉంది. ముఖ్యంగా ముఖం రంగు నల్లబడుతుందని పెద్దలు చెబుతుంటారు. అసలు ఈ వాదనలో నిజమెంత, నిజంగానే టీ అతిగా తాగితే చర్మం నల్లబడుతుందా లేదా అనేది తెలుసుకుందాం. వాస్తవానికి అతిగా టీ తాగడానికి చర్మం రంగు నల్లబడటానికి సంబంధం లేదంటున్నారు వైద్య నిపుణులు. చర్మం రంగు అనేది జెనెటిక్ అంశాలపై ఆధారపడి ఉంటుంది. టీ అతిగా తాగినా తాగకపోయినా ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ టీ అతిగా తాగితే ఆరోగ్యపరంగా నష్టాలు ఉండవచ్చు.
పాల టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా నష్టాలున్నాయి. అతిగా టీ తాగితే జీర్ణక్రియ బలహీనం కావచ్చు. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. టీ అతిగా తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలున్నాయి. నిగనిగలాడే చర్మం, మచ్చలు , మొటిమలు లేకుండా మృదువైన చర్మం కోసం గ్రీన్ టీ మంచి ప్రత్యామ్నాయం. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ముఖంపై గ్లోయింగ్ ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై పే మచ్చలు మొటిమలు కూడా దూరమౌతాయి. అందుకే చర్మ సంరక్షణకు గ్రీన్ టీ చాలా మంచిది.
Also read: AP Housing Scheme: అందరికీ ఇళ్లు పధకానికి ఎలా అప్లై చేసుకోవాలి. అర్హులెవరు, ఏ కాగితాలు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి