Navratri Fast Plan For Weight Loss: నవరాత్రి శుభ గడియలు ప్రారంభమైయ్యాయి. అయితే శాస్త్రం ప్రకారం..చైత్ర నవరాత్రులను మార్చి, ఏప్రిల్ నెలలో జరుపుపుకుంటారు. ఈ పవిత్రమైన తొమ్మది రోజుల పాటు మహిళలు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల్లో భాగంగా చాలా మంది అమ్మవారిని పూజిస్తారు. అయితే ఉపవాసంలో భాగంగా శరీరం యాక్టివ్‌గా ఉండడానికి పలు రకాల పండ్లను, పాలను మొదలైన వాటిని తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. అయితే ఈ 9 రోజుల్లో బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండ్లను ఉపవాసాల్లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే వీటితో పాటు పలు రకాల డ్రింక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
>> ఈ తొమ్మిది రోజుల పాటు నిమ్మ, నారింజ రసాలను ఉపవాసాల్లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నవరాత్రుల్లో చేస్తే శరీరానికి ప్రోటిన్లు అందడమేకాకుండా ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>> చాలా మంది ఉపవాసాల్లో అరటి పండ్లను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇలా సులభంగా అరటిపండును డ్రింక్‌ను చేసి కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ముందుగా బ్లెండర్లో అరటి ముక్కలు వేసి అందులో పాలు, చక్కెర వేసి ఫైన్‌గా జ్యూస్‌ల చేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని తీసుకుంటే చాలు ఉపవాసాల్లో శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
>>ఉపవాస సమయంలో చల్లటి లస్సీని కూడా తాగొచ్చు. అయితే దీనిని బరువు తగ్గడానికి ఒక పద్దతిలో చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా కొవ్వులేని పెరుగును తీసుకుని అందులో చక్కెర వేసుకుని లస్సీలా చేసుకుని తీసుకుంటే చాలు అనారోగ్య సమస్యలు దూరమవ్వడమేకాకుండా.. బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>> ఈ క్రమంలో గ్రీన్‌లను కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే గ్రీన్ టీని చేసే క్రమంలో తేనె, అల్లం వేసుకుని తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
>>కొబ్బరి పాలు కూడా తొమ్మిది రోజుల నవ రాత్రుల్లో భాగంగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం ఆరోగ్య ప్రయోజనాలు లభించడమేకాకుండా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook