Papaya Health Benefits: బొప్పాయిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, కాల్షియం కూడా ఉంటుంది . బొప్పాయిని ఉదయం పరగడుపున తీసుకోవటం వల్ల క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గుతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు బొప్పాయి తినాలి.. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి . బొప్పాయి తరచూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం..
బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడమేకాదు.. బొప్పాయి రక్త ప్రసరణను కూడా మెరుగు చేస్తుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. బొప్పాయిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ వారికి మంచిది అంతేకాదు హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది.
మెరిసే ముఖం..
బొప్పాయి తీసుకోవడం వల్ల మీ ముఖానికి సహజంగా.. కాంతివంతంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు డెడ్ స్కిన్ సేల్స్ తొలగిస్తాయి.. ముఖంపై ఉండే రంధ్రాలను బొప్పాయి తగ్గిస్తుంది. అంతేకాదు దీంతో మచ్చలు, గీతాలు రాకుండా ఉంటాయి. బొప్పాయి నేరుగా తినడం మాత్రమే కాదు.. ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. బొప్పాయిలో తినడం వల్ల పేగు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
మలబద్ధకానికి చెక్ ..
బొప్పాయి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది.. ఇందులోని జీర్ణ ఎంజైమ్స్ ఆహారాన్ని విడగొడతాయి. బొప్పాయి తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు ఇది ఎఫెక్టివ్ రెమిడీ. బొప్పాయి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. రుచికరంగా కూడా ఉంటాయి. దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బొప్పాయిని సలాడ్‌గా కూడా తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? ఇలా 3 నెలలు నెట్‌ఫ్లిక్స్ ఉచితం తెలుసా?
వెయిట్ లాస్..
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు బొప్పాయి తీసుకోవాలి. ఇది కడుపునిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.. కాబట్టి అతిగా తినకుండా ఉంటారు. బొప్పాయి డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో బరువు ఈజీగా తగ్గిపోతారు.
క్యాన్సర్..
బొప్పాయిలో లైకోపీని ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు బొప్పాయి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పీరియడ్ పెయిన్స్ తగ్గిపోతాయి. అందుకే కచ్చితంగా వారి డైట్‌లో ఉండాలి.
ఇదీ చదవండి: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
అయితే ఏదైనా అతిగా తీసుకోకూడదు బొప్పాయిని అతిగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి . ముఖ్యంగా లో బీపీతో బాధపడుతున్న వాళ్లు ఎలర్జీ ఉన్నవాళ్లు బొప్పాయి అతిగా తినకూడదు. వైద్య ఆరోగ్య నిపుణులు అభిప్రాయం తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.