How To Reduce High Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ఖరీదైన ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరికొంతమంది వైద్యులను సంప్రదించి కొలెస్ట్రాలను తగ్గించుకోవడానికి చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎంతో కొంతైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని తగ్గించుకోవడానికి వైద్యులు సూచించిన కొన్ని సాధారణ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా శరీర బరువు కూడా తగ్గొచ్చట..
చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి డైట్ ప్లాన్లను అనుసరించడం లేదు.. ఇలా చేయడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్స్ లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ చెడు కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ ను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఏయే డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
మొదటగా ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య నిపుణులు సూచించిన సాధారణ డైట్ ను పాటించాలి. అయితే దీంతోపాటు హాట్ చాక్లెట్ తో తయారు చేసిన డ్రింక్ ను కూడా తాగొచ్చట. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చాక్లెట్ డ్రింకును తాగాల్సి ఉంటుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి ఆకుకూరలు రసాలు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి మంచి పోషకాలను అందించి.. చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించి మంచి కొవ్వు పెంచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ రసం ప్రభావంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజుకు ఒకసారి ఆకుకూరల రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ రసం పొట్ట సమస్యలకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి