Simple Thyroid Test: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఈ సమస్య కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయటపడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలను కూడా డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడినప్పటికీ దీని లక్షణాలను గమనించలేకపోవడం కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారిలో అనేక లక్షణాలు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైన కొన్ని లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
థైరాయిండ్ 5 లక్షణాలు
1. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం:
థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం, అయితే హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. అలసట:
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఉన్నట్టుండి అలసట పెరిగిపోతుంది. ఇది హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా తరచుగా అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా థైరాయిడ్ టెస్టు చేయించుకోవడం ఎంతో మేలు.
3. చర్మం, జుట్టు సమస్యలు:
థైరాయిడ్ సమస్యలు చర్మం, జుట్టుపై ప్రభావం ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో చర్మం పొడిగా, ముతకగా మారవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమందిలో జుట్టు రాలడం కూడా సాధారణం. హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో చర్మం సన్నబడి జుట్టు కూడా రాలిపోతుంది.
4. మానసిక స్థితి మార్పులు:
థైరాయిడ్ సమస్యలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో నిరాశ, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వారు అంటున్నారు. ఇక హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో చిరాకు, ఆందోళన సహజమని వారంటున్నారు.
5. శరీర ఉష్ణోగ్రతలో మార్పులు:
థైరాయిడ్ సమస్యలు శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి