Weight Reducing Tips: ప్రస్తుతం అందర్నీ వేధించే సమస్య ఓవర్ వెయిట్. బరువు తగ్గించుకునే క్రమంలో అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం పూట కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ పద్ధతులేంటో చూద్దాం
ఊబకాయం లేదా అధిక బరువు. ఇదే ఇప్పుుడందరి సమస్య. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వివిధ రకాల పద్ధతులున్నాయి. ఎక్సర్సైజ్, ప్రకృతి వైద్యం, డైటింగ్, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వంటింటి చిట్కాలు ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికి తోచింది వారు చేస్తుంటారు. అయితే కొందరికి కొన్ని ఫలితాల్నిస్తే..మరి కొందరికి నిరాశ మిగుల్చుతాయి. ఈ క్రమంలో బరువు తగ్గించుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు వైద్య నిపుణులు. ఈ చిట్కాలు పాటిస్తే..కచ్చితంగా బరువు తగ్గుతారట. ఇప్పటికే చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు కదా. ఇది కూడా ఓసారి ట్రై చేయండి.
ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రోజుకు 1-2 రెమ్మలు వెల్లుల్లి తీసుకుని..ఆ తరువాత ఓ గ్లాసు నిమ్మరసం తీసుకుంటే మంచిది. ఇక ప్రతిరోజూ సాధ్యమైనంతవరకూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ తీసుకుంటే మంచిది.. ఫ్యాట్‌లెస్, ప్రోటీన్ ఫుడ్ కావడంతో ఆరోగ్యంతో పాటు బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
ఇక మరో ఆహార పదార్ధం ఓట్స్. ఓట్స్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం పూట అల్పాహారంగా ఓట్స్ తీసుకుంటే శరీరానికి కావల్సిన ఎనర్జీతో పాటు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట బర్లర్లు, పిజ్జాలు, ఛీజ్ వంటివి తీసుకోవద్దు. కొద్దిగా వ్యాయామం చేయడం ఖాళీ కడుపున ప్రతిరోజూ 1-2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం, భోజనం మధ్యలో కాకుండా ..భోజనానికి ముందే నీళ్లు తాగడం వంటివి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకోవాలి. లేదా సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలు డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఫ్యాట్ తక్కువగా ఉండే పదార్ధాల్ని ఎంచుకోండి. ఇక రోజూ పరగడుపున నిమ్మరసంతో పాటు తేనె కలుపుకుని సేవిస్తుంటే అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఉపశమనం కలుగుతుంది. అటు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక పండ్ల విషయంలో ఆపిల్స్ మంచివి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Anti Oxidants) ఆరోగ్యానికి చాలా మంచివి. ఏజీయింగ్ ప్రోసెస్‌ను నియంత్రిస్తాయి. బరువు తగ్గడంలో దోహదపడతాయి.
Also read: Diabetes Reduction Diet: రక్తంలో చక్కెర స్థాయి తగ్గాలంటే ఈ ఆహార నియమాలు పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.