Coconut Oil Benefits: కొబ్బరి నూనె తాగడమేంటని ఆలోచిస్తున్నారా.. ముమ్మాటికీ నిజం. కొబ్బరి నీళ్లే కాదు..కొబ్బరి నూనె కూడా తాగవచ్చు. కొబ్బరి నూనె తాగితే అద్భుతమైన లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
కొబ్బరి నూనెను చాలా మంది కేశాలకు లేదా ఒంటికి రాసుకుంటుంటారు. కేరళలో అయితే కొబ్బరి నూనెతో వంటలు వండుతుంటారు. ఎందుకంటే కొబ్బరి నూనె చర్మ సంరక్షణ, కేశాల సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ కొబ్బరి నూనె రోజూ క్రమం తప్పకుండా తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుసా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేశాలు నిగనిగలాడేందుకు, ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాటిక్ గుణాలు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ ఇందుకు ఉపయోగపడతాయి.
ఇక రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె క్రమం తప్పకుండా తాగితే శరీరానికి 5 అద్భుతమైన లాభాలు కలుగుతాయి. చలికాలంలో శరీరం కాస్త బలహీనంగా, నిస్సత్తువగా ఉంటుంది. రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల ఫ్రెష్‌నెస్ కలుగుతుంది. రోజూ ఉదయం వేళ తాగాల్సి ఉంటుంది. మరోవైపు శరీరంలో కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కొబ్బరి నూనెను రోజూ తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆకలి తగ్గి బరువు తగ్గడానికి దోహదమౌతుంది. మరోవైపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మెటబోలిజం వేగవంతమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దూరమౌతాయి. గుండె ఆరోగ్యానికి సైతం కొబ్బరి నూనె మేలు చేకూరుస్తుంది.
కొబ్బరి నూనె రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున తాగడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మం కాంతివంతంగా ఉండి అందంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై మచ్చలుండేవారికి ఈ ప్రక్రియ చాలా ఉపయోగకరం. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మంపై ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. శరీరంలో అంతర్గతంగా కూడా సమస్యలు తలెత్తవు.
Also read: Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.