Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రానికి హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఇందుకు తగ్గట్టే ఇప్పటికే హైదరాబాద్‌ను దట్టమైన మేఘాలు కమ్మేశాయి.
తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మేశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం మోస్తరు వర్షం నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడ్రోజులు హైదరాబాద్‌లో ఇదే వాతావరణం ఉండవచ్చని తెలుస్తోంది. వర్షం లేకపోయినా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండితో పాటు శుక్రవారం వరకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, జనగాం, భువనగిరి తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. నిన్న హైదరాబాద్‌లోని షేక్ పేటలో అత్యధికంగా 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 2-3 ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.