Girls Molested in UP: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే.. బాలికలపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ బాలికలు తినే ఆహారంలో మత్తు మందు కలిపి.. వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. పరీక్షల్లో ఫెయల్ చేయిస్తానని ఆ ప్రిన్సిపల్ బెదిరించాడు. చివరకు తల్లిదండ్రుల సహాయంతో బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో నవంబరు 18వ తేదీన ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేందుకు ఓ పాఠశాలకు చెందిన 17 మంది బాలికలను ప్రిన్సిపల్ వేరే స్కూల్ కు తీసుకెళ్లాడు. పరీక్ష పూర్తైన తర్వాత వారంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారికి పెట్టిన ఆహారంలో మత్తు మందు కలిపి ఆ తర్వాత ఆ బాలికలపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ విషయం బయటపెడితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ప్రధానోపాధ్యాయుడు బెదిరించిట్లు బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బాలికలు వారి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు.
తాము ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు పోలీసులు తమను పట్టించుకోలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. స్థానిక బీజేపీ ఎమ్మేల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు తమ కంప్లైయింట్ ను స్వీకరించారని బాలికల పేరెంట్స్ వెల్లడించారు.
ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాలని ముజఫర్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ కు తెలిపింది. ఫిర్యాదు తీసుకునే విషయంలో నిర్లక్ష్యయం వ్యవహరించినందుకు పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ సస్పెండ్ కు గురయ్యాడు. ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐదు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి.
Also Read: Nagaland: చిందిన రక్తానికి ప్రతీకారం తప్పదు-కాల్పుల ఘటనపై ఎన్‌ఎస్‌సీఎన్ హెచ్చరిక
Also Read: Omicron Scare: ఢిల్లీ లోకనాయక్ ఆసుపత్రిలో చేరిన ఆ ముగ్గురు, ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook