AAP Target Bengal: దేశ రాజధానిలో పాగా వేసిన తరువాత..మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించాలి. ఇదీ ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త ప్రణాళిక. ముందు ఢిల్లీ..తరువాత పంజాబ్. ఆప్ నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రమనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ వివరాలు పరిశిలిద్దాం.
ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త రాజకీయాలతో దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మొదటి ఢిల్లీలో పాగావేసిన ఆప్ ఇప్పుడు పంజాబ్ లో గద్దెనెక్కింది. దీంతో దేశవ్యాప్తంగా ఆప్‌పై చర్చ సాగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సత్తా చాటడంతో ఆప్ సైద్ధాంతిక అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆప్..ఇందుకోసం మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ తదుపరి లక్షం ఏ రాష్ట్రం అయి ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
అటు ఆప్ నుంచి కూడా సంకేతాలు అందుతున్నాయి. ఆప్ తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఈమేరకు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయనుందని కేజ్రీవాల్ ప్రటించారు. టీఆర్ఎస్ తరహాలో ముందు స్థానిక సంస్థల్లో పాగా వేసి ఆతర్వాత అసెంబ్లీపై దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో 2023 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్..ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించింది. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు స్థానిక యూనిట్లు కూడా ఈపాటికే తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇటీవలే కోల్‌కతాలో ఆప్ భారీ ర్యాలీ కూడా నిర్వహించింది.
మరోవైపు ఆప్ బెంగాల్ రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ నాయకుడు సమిక్ భట్టాచార్య స్పందించారు. ఆప్‌కు బెంగాల్లో కార్యకర్తలు దొరకడం అంతే తేలిక కాదని అన్నారు. గోవాపై దృష్టి పెట్టిన టీఎంసీ అధినేత మమతబెనర్డీ ఏవిధంగా అయితే విజయం సాధించలేకపోయారో.... అదే విధంగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించిన ఆప్ సఫలం కాలేదన్నారు. బెంగాల్లో బీజేపీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను ఏ పార్టీ అడ్డుకోలేదని చెప్పారు. కమ్యునిస్టుల పాలన చూసిన బెంగాళీలు ఇప్పుడు టీఎంసీ పాలనతో కూడా విసిగిపోయారని చెప్పారు. ఇప్పుడిప్పుడే బెంగాల్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నారని చెప్పారు. ఈ స్థానాన్ని ఆప్ ఎప్పటికీ భర్తీ చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆప్ కార్యకర్తలు మాత్రం జోరు తగ్గించడం లేదు. బెంగాల్లో నెలకొన్న పొలిటికల్ స్పేస్‌ను పూరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read: Children Vaccination: మార్చి 16 నుంచి మొదలు.. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook