Prayag raj maha kumbh mela latest news: ఉత్తర ప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లో కుంభమేళ పుణ్యస్నానాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వస్తునే ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇదిలా ఉండగా.. కుంభమేళలో ఇప్పటి వరకు 39 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంకా రెండు షాహీ స్నానాలు మిగిలి ఉన్నాయి.
అయితే.. వీటిని పుణ్యస్నానాలుగా మాత్రమే భావిస్తారు. అమృత స్నానం పరిగణించరు. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26లో భక్తులు ఇంకా వస్తారని అధికారులు చెబుతున్నారు. మాఘపౌర్ణమి, మహా శివరాత్రుల్లో కూడా భక్తులు పుణ్నస్నానాలు ఆచరించేందుకు ఆసక్తిని చూపిస్తారని పండితులు చెబుతున్నారు. అయితే.. కుంభమేళలకు అఖాడాలు, నాగసాధులు, అఘోరీలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారని చెప్పుకొవచ్చు.
చాలా మంది కుంభమేళలకు వచ్చి అఖాడాల నాగసాధులను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వీరి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రస్తుతం అనేక అఖాడాలకు చెందిన నాగ సాధులు, గురువులు కుంభమేళను వదిలి వెళ్లిపోతున్నారు. దీనికి సింబాలిక్ గా కుంభమేళలో వారు ఏర్పాటు చేసిన ధర్మధ్వజంను అవనతం చేశారు.
ఈ అఖాడాలు తదుపరి కాశీ, గయా, అయోధ్య,బృందావన్, ఆనంద్ పూర్ సాహీబ్ మొదలైన ప్రదేశాలను చూసుకుంటూ తమ స్థానాలకు తిరిగి చేరుకుంటారని అఖాడాల ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు ప్రయాగ్ రాజ్ లో మాత్రం భక్తులు ఇంకావస్తునే ఉన్నారు. ఇప్పటికే దేశ ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రల ముఖ్య మంత్రులు, సినిమా సెలబ్రీటీలు, భూటాన్ రాజు త్రివేణి సంగమంకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter