Ayodhya Chief Priest Satyendra das: అయోధ్య రామాలయం ప్రధాన పూజారీ కన్నుమూత... సంతాపం తెలిపిన మోదీ..

Acharya Satyendra das: అయోధ్య రామ్ లల్లా ఆలయం ప్రధాన పూజారీ కన్నుమూశారు. ఆయన కొన్నిరోజులుగా లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ కు గురై రాముడిలో ఐక్యం అయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 12, 2025, 02:08 PM IST
  • అయోధ్య ఆలయ ప్రధాన పూజారీ కన్నుమూత..
  • ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటుగా పేర్కొన్న యోగి..
Ayodhya Chief Priest Satyendra das: అయోధ్య రామాలయం ప్రధాన పూజారీ కన్నుమూత... సంతాపం తెలిపిన మోదీ..

Ayodhya ram mandir chief priest acharya satyendra das passes away: అయోధ్య రామ్ లల్లా ఆలయ ప్రధాన పూజారీ ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ రోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన బీపీ, మధుమేహాం సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను లఖ్ నవులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ ఈరోజు ఆయనకు ఒక్కసారిగా బ్రైయిన్ స్ట్రోక్ రావడంతో కన్నుమూశారు.  ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూతతో అయోధ్య ప్రజలు కన్నీరు మున్నిరవుతున్నారు.  ఆయన ఆలయంలో మొదటి నుంచి పూజారీగా ఉన్నారు.

1992 లో డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన మందిరానికి తాత్కలిక పూజారీగా ఉన్నారు. ఆ సమయంలో రామ్ లల్లా విగ్రహాలను  ఆయన సమీపంలోని ఫకీర్ మందిర్ కు తీసుకెళ్లారు.  కూల్చివేతల అనంతరం మళ్లీ రామజన్మభూమికి తీసుకొచ్చి.. విగ్రహాలకు మరల పూజలు చేశారు. ఆచార్య సత్యేద్ర దాస్.. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరారు.

 తొలినాటి నుంచి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.  ప్రస్తుతం ఆయన రామాలం ప్రధాన పూజారీగా ఉన్నారు.  సత్యేంద్ర దాస్ కు ప్రస్తుతం 85 ఏళ్లు. సత్యేంద్రదాస్ అంత్యక్రియలను గురువారం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున నిర్వహించనున్నట్లు ఆయన శిష్యులు వెల్లడించారు.

Read more: Narendra Modi Paris: ఆ విషయంలో ఏఐతో డేంజర్..పారిస్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..

ఈ క్రమంలో సత్యేద్ర దాస్ మరణం పట్ల దేశ ప్రధాని, ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ తమ సంతాపం వ్యక్తం చేశారు.  సత్యేంద్ర దాస్ మరణం.. ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటన్నారు. సత్యేంద్ర దాస్ జీ మహారాజ్ మరణం పట్ల దేశ వ్యాప్తంగా రామ్ లల్లా భక్తులు కూడా తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. మరోవైపు పవిత్రమైన మాఘీ పౌర్ణమిరోజున ఆయన కన్నుమూసి, రాముల వారి పాదాల చెంతకు వెళ్లారని  ఆయన శిష్యులు పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News