Manmohan Singh No More: అనారోగ్యంతో బాధపడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. వైద్యులు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో అతడి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 92 ఏళ్ల మాజీ ప్రధాని కన్నమూయడంతో దేశం మూగబోయింది.
Also Read: K Annamalai: ప్రభుత్వం దిగిపోయేవరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై పాదరక్షల శపథం
మన్మోహన్ సింగ్ మరణవార్తతో భారతదేశం మూగబోయింది. అతడి మరణవార్త విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాజకీయ పార్టీలతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, దేశ, విదేశీ ప్రతినిధులు సంతాపం తెలిపారు. మన్మోహన్ కుటుంబానికి తీవ్ర సానుభూతి వెలిబుచ్చారు. మన్మోహన్ మరణవార్తతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు.
Also Read: Traffic E Challan: ట్రాఫిక్ ఈ చలాన్ల డిస్కౌంట్లు.. పోలీస్ శాఖ సంచలన ప్రకటన
1991-96 కాలంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. పీవీ, మన్మోహన్ హయాంలో భారతదేశం ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. యూపీఏ హయాంలో రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి విశేష సేవలు అందించారు. 2004 నుంచి 2014 వరకు దేశ అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఏప్రిల్ చట్టసభల నుంచి వైదొలిగారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ గాంధేయేతర ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పరిపాలించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 2004 మే 22లో బాధ్యతలు స్వీకరించిన ఆయన 2014 వరకు కొనసాగారు.
1932 సెప్టెంబర్ 26వ తేదీన పంజాబ్ (నేటి పాకిస్తాన్)లోని కుటుంబంలో జన్మించారు. అనంతరం దేశ విభజనలో భారతదేశానికి మన్మోహన్ కుటుంబం వచ్చింది. మన్మోహన్ సింగ్‌కు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అర్థశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు.
ఆర్థికశాస్త్రంలో సీనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన అనేక విద్యాలయాల్లో పని చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో విశేష గుర్తింపు పొందారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టి అనంతరం మంత్రివర్గంలో భాగమై దేశ ఆర్థిక స్థితిగతలును మార్చేశారు. ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా, రాజస్థాన్ నుంచి ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.