MUDA Scam: ముడా కేసులో ఈడీ దూకుడు.. ముఖ్యమంత్రి రూ.300 కోట్ల ఆస్తులు సీజ్‌

Siddaramaiah ED attaches Rs 300 Crore Assets: కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్‌ తగిలింది. అతడికి సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం రేపింది. దీంతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 17, 2025, 11:36 PM IST
MUDA Scam: ముడా కేసులో ఈడీ దూకుడు.. ముఖ్యమంత్రి రూ.300 కోట్ల ఆస్తులు సీజ్‌

MUDA Scam Assets: కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూముల కేటాయంపుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సిద్ధరామయ్య తన భార్య పార్వతికి అత్యంత ఖరీదైన భూములు దక్కేలా కుట్ర చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఈడీ విచారణకు గవర్నర్‌ ఆదేశించారు. గవర్నర్‌పై హైకోర్టులో సవాల్‌ చేయగా.. కోర్టు కొట్టివేసింది.

Also Read: DK Aruna: 'రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'

ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. ముడా కుంభకోణంలో విచారణ చేపడుతున్న ఈడీ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్యకు సంబంధించిన రూ.300 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. కర్ణాటకలోని వివిధ చోట్ల సిద్ధరామయ్యకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఆస్తుల అటాచ్‌తోపాటు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈడీ వెల్లడించింది.

Also Read: Chandrababu Tour: వైఎస్‌ జగన్‌ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?

కేసు ఏమిటి?
ముడా పరిధిలోని ఖరీదైన భూములను సిద్ధరామయ్య అధికార పలుకుబడి ఉపయోగించి అతడి భార్య పార్వతి పేరు మీద 14 ఫ్లాట్లు అతి తక్కువకు అప్పగించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్‌, స్నేహమయి కృష్ణ తదితరులు విచారణ చేపట్టి సిద్ధరామయ్య అక్రమంగా ఆ ప్లాట్లను అతడు తన భార్య పేరు మీద వచ్చేలా కుట్ర పన్నారని తేల్చారు. ఈ వ్యహారంలో ఈడీ, గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాత్‌ కల్పించుకోవడంతో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించితే కూడా నిరాశ మిగిలింది.

కోర్టులు కల్పించుకోకపోవడంతో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు బహిరంగంగా సీఎం పదవి నుంచి వైదొలుగాలని కొందరు భావిస్తున్నారు. ముడా కుంభకోణం కేసు నిరూపితమైతే సిద్ధరామయ్య జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. విచారణ చేపట్టి ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణ చేస్తామని కేసును వాయిదా వేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News