Bihar Pocso Court: అత్యాచార కేసులో ఒక్క రోజులోనే తీర్పు-బిహార్ పోక్సో కోర్టు రికార్డ్...

Fastest rape case conviction: ఓ అత్యాచార కేసులో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా బిహార్‌లోని అరారియా పోక్సో కోర్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు,అత్యంత వేగవంతమైన విచారణ రికార్డు మధ్యప్రదేశ్‌లోని దాతియా కోర్టు పేరిట ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 02:13 PM IST
  • రికార్డుల్లోకి ఎక్కిన బిహార్ అరారియా పోక్సో కోర్టు
  • అత్యాచార కేసులో ఒక్కరోజులోనే విచారణ, తీర్పు
  • దోషిగా యావజ్జీవ ఖైదుతో పాటు రూ.50వేలు జరిమానా
Bihar Pocso Court: అత్యాచార కేసులో ఒక్క రోజులోనే తీర్పు-బిహార్ పోక్సో కోర్టు రికార్డ్...

Fastest rape case conviction: బిహార్‌లోని ఓ పోక్సో కోర్టు (Pocso Court) రికార్డుల్లోకెక్కింది. ఓ అత్యాచార కేసుకు (Rape case) సంబంధించిన విచారణను ఒక్క రోజులోనే పూర్తి చేసి తీర్పు వెలువరించింది. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా కేసు విచారణ జరిపి తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా ఆ పోక్సో కోర్టు రికార్డు సాధించింది. బిహార్‌లోని అరారియా జిల్లా పోక్సో కోర్టు (Bihar Araria Pocso Court) ఇచ్చిన ఈ తీర్పు అత్యాచార బాధితులకు సత్వర న్యాయంపై నమ్మకం కలిగిస్తోంది.

అరారియా జిల్లా పోక్సో కోర్టు (Protection of Children from Sexual Offences) గత నెలలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార కేసును (Minor girl raped) విచారించింది. ఆ బాలిక జులై 22న అత్యాచారానికి గురవగా... ఆ మరుసటి రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. అరారియా మహిళా పోలీ స్టేషన్ ఇన్‌ఛార్జి రీతా కుమారి ఈ కేసును పర్యవేక్షించారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటైంది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దీనిపై విచారణ జరిపారు.

అక్టోబర్ 4న ఈ కేసు కోర్టు ముందుకు రాగా... ఒక్కరోజులోనే న్యాయమూర్తి విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. మొత్తం 10 మంది సాక్షులను విచారించారు. ఇరు వర్గాల వాదనలు, కౌంటర్స్ అంతా ఒక్క రోజులోనే పూర్తి చేశారు. చివరకు నిందితుడు దిలీప్ కుమార్ యాదవ్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షతో పాటు రూ.50వేలు జరిమానా విధించారు. అక్టోబర్ 4నే తీర్పు వెలువరించినప్పటికీ.. ఆ తీర్పు కాపీ నవంబర్ 26న అందుబాటులోకి వచ్చింది. అత్యంత వేగంగా ఇచ్చిన ఈ తీర్పు పట్ల బిహార్ (Bihar) ప్రభుత్వం సైతం హర్షం వ్యక్తం చేసింది. ఇలా ఒక్కరోజులోనే తీర్పునివ్వడం బహుశా దేశంలోనే మొదటిసారి కావొచ్చునని బిహార్ హోంశాఖ పేర్కొంది.

Also Read: Peru Earthquake: 7.5 తీవ్రతతో పెరూలో పెను భూకంపం..10 మందికి గాయాలు..

గతంలో అత్యంత వేగవంతంగా విచారణ జరిపి తీర్పును వెలువరించిన రికార్డు మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దాతియా జిల్లా కోర్టు పేరిట ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ లాల్ వెల్లడించారు. అగస్టు,2018లో ఓ కేసు విచారణను 3 రోజుల్లో పూర్తి చేసి  తీర్పు వెలువరించిందన్నారు. ఇప్పుడు ఆ రికార్డును బిహార్ అరారియా కోర్టు అధిగమించిందని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News