Fastest rape case conviction: ఓ అత్యాచార కేసులో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించిన న్యాయస్థానంగా బిహార్‌లోని అరారియా పోక్సో కోర్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు,అత్యంత వేగవంతమైన విచారణ రికార్డు మధ్యప్రదేశ్‌లోని దాతియా కోర్టు పేరిట ఉంది.
Five youths awarded life imprisonment in Anantapur District for rape : ఆమెను బెదిరించి సమీపంలోని చెక్‌డ్యాం వద్దకు బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ కలిసి సామూహికంగా ఆమెపై అత్యాచారం (Rape) చేశారు. అదంతా మొబైల్స్‌లలో (Mobiles) వీడియో తీశారు.
Dera Chief Gurmeet Ram Rahim: డేరా బాబా(dera baba) అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఓ హత్య కేసులో జీవిత ఖైదు విదిస్తూ..తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ఆమె శవాన్ని 300 ముక్కలు చేసిన నేరానికిగాను ఇండియన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సోమ్‌నాథ్ పరిడాకు భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. క్లూస్ టీమ్ అందించిన శాస్త్రీయ ఆధారాలు, 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఖోర్జా జిల్లా కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
గోద్రా రైలు బోగి దహనం కేసులో గుజరాత్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మంది ఖైదీలకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుగా మారుస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన 63 మందిని దోషులుగా చేర్చడం కుదరదని గుజరాత్ సర్కార్‌కు తెలిపింది. అలాగే రైలు ఘటన మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని గుజరాత్ సర్కార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నష్ట పరిహారం చెల్లింపునకు ఆరువారాల గడువు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.