CBI Raids: దేశ రాజధానిలో జరుగుతున్న సీబీఐ సోదాలు రాజకీయ రచ్చకు దారి తీశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్ గోపి కృష్ణ నివాసంలోనూ సీబీఐ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల కేసులో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు.ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంటితో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 21 చోట్ల సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు.
గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. అయితే కొత్త పాలసీలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.దీంతో కొత్త మద్యం పాలసీపై నివేదిక ఇచ్చిన సీఎస్.. ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు చెప్పారు. టెండర్ల విధానంలో కొందరికి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎస్ తన నివేదికలో పొందు పరిచారు. ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. సీఎస్ నివేదిక ఆధారంగా కొత్త మద్యం పాలసీలో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫారస్ చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగా సోదాలు చేపట్టింది.
తన నివాసంలో జరుగుతున్న సోదాలపై మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంటికి సీబీఐ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. లక్షల మంది పిల్లలకు భవిష్యత్ కోసం తాము నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. . దర్యాప్తు సంస్థకు సహకరిస్తామని తెలిపారు. సీబీఐకి తన వద్ద ఏమీ దొరకదని అన్నారు. దేశం కోసం మంచి పనులను చేసేవాళ్లను వేధించడం దురదృష్టకరమని సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో తాను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరన్నారు. నిజం నిలకడగా తెలుస్తుందని సిసోడియా ట్వీట్ చేశారు. సీబీఐ సోదాలపై తనదైన శైలిలో స్పందించారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. సీబీఐకి స్వాగతం చెబుతూ ఆయన ట్వీట్ చేశారు ప్రపంచం మొత్తం ఢిల్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మోడల్ పై చర్చ జరుగుతుందని, దీన్ని ఆపాలనే కేంద్రం ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశంలో మంచిపని చేసే వారిని ఇబ్బందులు పెడుతున్నారని.. అందుకే ఇండియా ఇప్పటికీ నెంబర్ వన్ గా లేదన్నారు. ఎవరేం చేసినా.. తాము చేసే మంచి పనులు ఆపలేరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read Also: TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం
Read Also: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి