న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2020పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. చాలా కాలం తరవాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం 160 నిమిషాల పాటు కొనసాగినా, ఉపయోగమేమి లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2020లో ఆర్థిక మంత్రి ఉద్దేశ్యాలు అర్ధం కావడం లేదని, ఆమె చేసిన ప్రసంగంలోని అంశాలను గుర్తు తెచ్చుకోలేక పోతున్నాని ఆయన అన్నారు.
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, వృద్ధి రేటును వేగవంతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, సామర్థ్యాన్ని పెంచడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ వాటాను పొందడం వంటి అంశాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు.
P Chidambaram,Congress: In 2019-20, Finance Minister failed to meet any of the key Budget Estimate targets — nominal GDP growth,fiscal deficit,net tax revenue collection, disinvestment revenue or total expenditure. There is no assurance that she will meet targets set for 2020-21. pic.twitter.com/4Cg2zFsRaH
— ANI (@ANI) February 1, 2020
మరోవైపు మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీస కేటాయింపులు లేవని, బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా దానికి సంబందించి కేంద్రం ఎలాంటి కేటాయింపులు జరపలేదని పేర్కొన్నారు.
దీనిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..