HMPV Cases: చైనా వైరస్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ విషయమై దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దన్నారు. ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తించారు. మూడు నెలల ఆడ శిశువును, తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో హాస్పిటల్ లో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. మూడు నెలల చిన్నారి ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కాగా.. మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్పేట్, గిండిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన వీరినుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనే దానిపై గుట్టు తేలాల్సి ఉంది.
దేశాన్ని HMPV వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా.. దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్ల పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపనుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3 నుంచి ఆరు రోజుల తర్వాత లక్షణాలు అంటే జబ్బు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.