HMPV Alert: చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాను భయపెడుతోంది. చైనా కొత్త వైరస్ రెండు కేసులు బెంగళూరులో నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది. రెండు కేసులు బెంగళూరులో నమోదవడమే కాకుండా విదేశాల్నించి వచ్చింది కాకపోవడంతో ఎలా అనేది అంతుచిక్కడం లేదు.
ఇండియాలో హెచ్ఎంపీవీ వైరస్ అడుగుపెట్టేసింది. రెండు హెచ్ఎంపీవీ కేసుల్ని ఐసీఎంఆర్ ధృవీకరించడంతో అందరిలో టెన్షన్ బయలుదేరింది. ఈ రెండింటిలో ఒకటి మూడు నెలల చిన్నారికైతే రెండవది 8 నెలల చిన్నారికి. ఈ రెండు కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలో ప్రస్తుతం ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. హాంకాంగ్, మలేషియా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ఇండియాలో కూడా 4 కేసులు వెలుగు చూడటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారిని ఐసోలేషన్‌కు తరలించాలనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొంతమంది వైద్యులు మాత్రం చలికాలంలో ఈ తరహా వ్యాధులు సహజమేనని చెబుతున్నారు. అయితే కరోనా మార్గదర్శకాలు పూర్తిగా పాటించాలని కోరుతున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, కరచాలనానికి దూరంగా ఉండటం, శానిటైజర్ ఉపయోగం వంటివి తిరిగి మొదలెట్టాల్సి ఉంటుంది.
బెంగళూరు నగరంలో రెండు కేసులు రావడం, అది కూడా విదేశాల్నించి వచ్చినవారు కాకపోవడంతో ఎలా సోకిందనేది ట్రాక్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించేది కావడంతో అందరూ అప్రమత్తమౌతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రమత్తత జారీ అయింది. కర్ణాటక నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే వాదన విన్పిస్తోంది. వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి అని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిపై పూర్తి అవగాహన వచ్చేవరకు బెంగళూరు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వస్తోంది.
Also read: APPSC Notifications: నిరుద్యోగులకు బంపర్ న్యూస్, 2,686 పోస్టుల భర్తీ, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.