Corona New Variant Jn.1: దాదాపు సమసిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇందుకు కారణం. సింగపూర్‌లో విరుచుకుపడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో ప్రవేశించడమే కాకుండా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రమాద తీవ్రతను పెంచుతోంది.
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే దేశంలో ప్రవేశించింది. సింగపూర్‌లో కరోనా కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతూ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. మరోవైపు దేశంలో కూడా గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా కొత్త కేసులు 423 నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో అత్యధికంగా 70 కేసులున్నాయి. తమిళనాడులో 13, మహారాష్ట్రలో 15, గుజరాత్‌లో 12, తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. వీరిలో కేరళ నుంచి ఇద్దరు, కర్ణాటక, రాజస్థాన్‌లో చెరొకరు మరణించారు.
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి ఇంతకుముందు వచ్చిన వేరియంట్లలా వేగంగా ఉంటుంది కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. కరోనా సంక్రమణను అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ సంక్రమణపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష అనంతరం రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్ వార్డుల ఏర్పాటు, ప్రత్యేక పరీక్షలు ప్రారంభించారు. కరోనా వైరస్ మొదటి వేవ్ నుంచి లెక్కిస్తే ిప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,33,332 మంది మరణించారు. రికవరీల సంఖ్య 4, 44, 71, 212 మంది ఉన్నారు.
కరోనా సంక్రమణ పెరుగుతుండటంతో ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిర్దిష్టమైన ఆదేశాల్లేకపోయినా ఎక్కడికక్కడ మాస్క్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని విద్యా సంస్థల్లో అయితే పిల్లల్ని మాస్క్ ధరించమని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా కొందరు మాస్క్‌తో కన్పిస్తున్నారు.
Also read: AP Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook