Corona Third Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి ఊపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని సీడీసీ హెచ్చరిస్తోంది.
ప్రపంచమంతా మరోసారి కరోనా మహమ్మారి ఉచ్చులో బిగుసుకుంటోందా అంటే అవుననే అన్పిస్తోంది. ఆటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ, ఇటు ఇండియాలోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇండియాలో ఊహించినట్టే కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)తాకింది. రెండ్రోజుల్నించి లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి విషమిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రోజుకు ఏకంగా పది లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళన కల్గించే అంశాల్ని అమెరికా సీడీసీ(CDC) వెల్లడించింది. ఈసారి కరోనా బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని సీడీసీ స్పష్టం చేసింది.
అమెరికాలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోందని సీడీసీ డేటా విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని 250 ఆసుపత్రుల డేటా ఆధారంగా వివరాలు వెల్లడించింది. ఆసుపత్రుల్లో చేరుతున్నవారిలో 50 శాతం మంది 12-18 ఏళ్ల వయస్సువారని వెల్లడించింది. 5-11 ఏళ్ల మద్య ఉన్నవారు 16 శాతమున్నారని తెలిపింది. ప్రస్తుతం అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయినా కరోనా సోకడం ఆందోళన కల్గిస్తోందని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా అమెరికాలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్ అని అధికారులు వెల్లడించారు. ఇండియాలో కూడా కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై (Corona Third Wave on Children)ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read: Corona Precautionary dose: కరోనా ప్రికాషన్ డోసుకు రిజిష్ట్రేషన్ అవసరం లేదు.. కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook