Corona Cases In India: క్రితం రోజుతో పోలిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,309 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా ధాటికి మరో 236 మంది మృతి చెందారు. ఒక్కరోజే 9,905 మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే 42,04,171కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,22,41,68,929కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో (Corona Virus Cases Worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,89,114 మందికి కరోనా (Corona update) సోకింది. 4,294 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,17,48,775కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 52,16,961కు పెరిగింది.
దేశంలో ఒమిక్రాన్ కలవరం
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఆ మహమ్మారి ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని అనుమానంతో అతడి నమూనాలను ల్యాబ్ కు పంపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు.
దీంతో పాటు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరు తిరిగొచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు తెలియడం వల్ల అధికారులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వారికి సోకింది డెల్డా వేరియంట్ అని పరీక్షల్లో తేలడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచారు.
Also Read: Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook