Vaccine Patent: దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినట్టే..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనలు చేశారు. అలా చేస్తేనే వ్యాక్సిన్ కొరతను అధిగమించవచ్చంటున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)..ప్రధాని మోదీకు వ్యాక్సిన్ విషయమై లేఖ రాసిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ (Bharat Biotech) కంపెనీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్( Covaxin) ఉత్పత్తి సామర్ధ్యం పెంచాలంటే వ్యాక్సిన్ పేటెంట్‌ను డీలైసెన్సింగ్ ( Patent Delicense) చేయాలని సూచించారు.పేటెంట్ టెక్నాలజీ బదిలీ విషయం ఆలోచించాలన్నారు. అలా చేయడం ద్వారా వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేయవచ్చన్నారు.ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం వ్యాక్సిన్ ఉత్పత్తి పంచేందుకు అవే సూచనలు చేశారు. వ్యాక్సిన్ కొరతను అధిగమించాలంటే..వ్యాక్సిన్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం తీసుకుని..వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు ఇవ్వాలని కోరారు. అప్పుడే భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తి సాధ్యమై..దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుతుందన్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న రెండు కంపెనీల వ్యాక్సిన్‌లతో ప్రతి ఒక్కరికీ అందించాలంటే రెండేళ్లు పడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. అందుకే వ్యాక్సిన్ నేషనల్ ప్లాన్ రూపొందించాలని అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal)కేంద్రానికి సూచించారు.రెండు కంపెనీలపై ఆధారపడకుండా..ఆ ఫార్ములాను అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు అందించాలన్నారు. అసలు ఉత్తత్తిదారుడికి మిగిలిన కంపెనీలు రాయల్టీ చెల్లిస్తాయన్నారు.
Also read: AP CM Ys Jagan Letter: కోవ్యాగ్జిన్ పేటెంట్ డీలైసెన్సింగ్ చేస్తేనే..ఉత్పత్తి పెరుగుతుంది : Ys Jagan
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook