Delhi CM:ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించారు. ఆర్థిక, మహిళా,శిశు సంక్షేమం, విజిలెన్స్, రెవెన్యూ శాఖలను ఆమె స్వయంగా పర్యవేక్షించనున్నారు. మంత్రి పర్వేశ్ వర్మకు ప్రజాపనులు, తాగునీరు, శాసనసభా వ్యవహారాలు, నీటిపారుదల శాఖలను అప్పగించారు. మంత్రి అశీశ్ సూద్‌కు హోం, విద్యుత్, విద్య, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు.
మంత్రి కపిల్ మిశ్రాకు న్యాయ, కార్మిక, ఉపాధి, పర్యాటకం శాఖలు కేటాయిస్తే..మరో మంత్రి మంజిందర్ సింగ్‌కు పరిశ్రమలు, అటవీ-పర్యావరణం, ఆహారం-సరఫరా శాఖల మంత్రిగా నియమించారు. అటు పంకజ్ సింగ్‌కు ఆరోగ్యం, రవాణా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు.. రవీందర్ ఇంద్రజ్‌కు సాంఘిక సంక్షేమం, ఎస్సీ,ఎస్టీ సంక్షేమం, సహకార శాఖలను కేటాయించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి కావడంతో ఆమె స్వస్థలమైన హరియాణాలోని నందగడ్ వాసులు సంబురాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో రేఖా గుప్తా గెలవాలని ముందుగా ప్రార్ధనలు చేశారు. ఆ తర్వాత ఆమెకు సీఎం పదవి దక్కాలని ఆ తర్వాత... ప్రవీణ్ అనే 24 ఏళ్ల కుర్రాడు గత 22 రోజులుగా నిలబడి దీక్ష చేస్తున్నాడు. ప్రవీణ్ ప్రార్థనలను దేవుడు ఆలకించాడంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మరో 19 రోజులు జాతర జరగనుంది. అది ముగిసే వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రవీణ్ తెలిపారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.