Delhi Corona Update: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇవాళ కీలకమైన సమావేశం జరగనుంది.
కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. మరోవైపు ఢిల్లీలో కోవిడ్ కేసులు (Delhi Corona Update)పెరుగుతున్న క్రమంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ చర్చించనున్నారు. సమావేశం అనంతరం డీడీఎంఏ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది.
ఇంతకుముందు కూడా పలు సమావేశాల అనంతరం డీడీఎంఏ (DDMA) సూచనల మేరకు ఢిల్లీలో వీక్లీ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ విధించారు. రానున్న నెలరోజులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ కట్టడిలో భాగంగా ఢిల్లీలో 11 వేల 487 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 22 వేల 751 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించారు.ఇక కరోనా పాజిటివిటీ రేటు 23.5 శాతంగా ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకూ 15 లక్షల 49 వేల 730 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also read: Covid-19 Updates: షాకింగ్ న్యూస్.. 300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook