National Wide Protest As Block Friday: ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనల్లో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వేలాదిగా రైతులు ఢిల్లీకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మలు, టియర్ గ్యాస్ లతో ఎక్కడిక్కడ రైతులను కట్టడిచేస్తున్నారు . ఇదిలా ఉండగా.. పంజాబ్, హర్యానా సరిహద్దులో శంభు వద్ద తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది.
Read More: Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో అస్సలు కన్పించవు..
కేంద్ర మంత్రులు, రైతులతో చేసిన నాలుగో విడత చర్చలు కూడా విఫలమవ్వడంతో, నిరసనలను మరింత తీవ్ర తరం చేశారు. దీనిలో భాగంగా నిన్న యూపీ పంజాబ్ సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున రైతులు... ట్రాక్టర్లు, జేసీబీలతో ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ అల్లర్లలో నిన్న ఒక రైతు పోలీసుల కాల్పులలో చనిపోయాడు. దీంతో వాతావరణం మరింత హీట్ ను పెంచేదిగా మారింది.
22 ఏళ్ల వయసులో శుభకరన్ సింగ్ అనే రైతుల మరణించాడు. దీంతో రైతులు రెండు రోజుల పాటు నిరసనలు బ్రేక్ ఇచ్చాయి. ఇక .. కేంద్రం వైఖరీకి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా రేపు దేశ వ్యాప్తంగా బంద్ ను ప్రకటించింది. కేంద్ర హోమంత్రి అమిత్ షా, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రేపు దేశ వ్యాప్తంగా నిరసనలు చేయాలని రైతు నేతలు పిలుపునిచ్చారు.
అలాగే చనిపోయిన రైతుకు రుణమాఫీ చేయాలని, అతని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. విలేకరుల సమావేశంలో, హర్యానా సీఎం ఖట్టర్, హోంమంత్రిపై భారతీయ శిక్షాస్మృతి (హత్య) ఆర్టికల్ 302 కింద కేసు నమోదు చేయాలని కూడా రైతు పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు.
Read More: Nayantara: సన్ ఫ్లవర్ శారీలో నయనతార అందాలు.. ‘లవ్ థిస్ ఫ్లవర్’ అనేసిన విజ్ఞేశ్ శివన్
పంజాబ్‌లోకి ప్రవేశించిన తర్వాత 25-30 ట్రాక్టర్-ట్రాలీలను ధ్వంసం చేసినందున, హర్యానాకు చెందిన పారామిలిటరీ ఫోర్స్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని SKM కోరుతోంది. రేపు బ్లాక్ ఫ్రైడే దేశవ్యాప్తంగా నిరసనతో పాటు, రైతు సంఘం ఫిబ్రవరి 26న ట్రాక్టర్ మార్చ్, మార్చి 14, 2024న రాంలీలా గ్రౌండ్‌లో ర్యాలీని నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా సంఘం రైతులు తమ కార్యాచరణను వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook