Delhi Alipur Paint Factory Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలీపూర్‌లోని మార్కెట్ ప్రాంతంలోని గోడౌన్ లో నిన్న సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమైనట్లు అధికారులు గుర్తించారు. పెయింట్ ఫ్యాక్టరీలో భారీగా విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ఘటనలో..రెండు గోడౌన్లు, డి-అడిక్షన్ సెంటర్‌లో మంటలు వ్యాపించాయని అధికారులు గుర్తించారు.
#Delhi | Search operation underway after a fire broke out at a Paint factory in Alipur yesterday, killing 11 people
"2 more persons are likely trapped," says Atul Garg, Director of Delhi Fire Services#DelhiNCR #DelhiFire #PaintFactory #DelhiChalo pic.twitter.com/htDZgDUBsw
— Neha Bisht (@neha_bisht12) February 16, 2024
వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
బుధవారం.. సాయంత్రం 5:25 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారి తెలిపారు. మంటలు చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించిందని తెలుస్తోంది.
Read More: Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. భారత దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్కడు..
గోడౌన్ ల నిల్వ చేసిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు అనుమానిస్తున్నారు. భీకరంగా ఎగిసిపడిన మంటలు పక్కనే ఉన్న ఇంటికి, నషా ముక్తి కేంద్రానికి వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన వెలుగులోకి రాగానే అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సహయక చర్యలను ముమ్మరం చేశారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఆదేశించారు. అయితే.. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook