SIM cards : మీ దగ్గర 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉన్నాయా... అయితే కనెక్షన్ కట్!

DoT to deactivate extra SIM connections : మన దేశంలో ఒకే వినియోగదారుడి పేరుపై తొమ్మిది 9 కంటే ఎక్కువ సిమ్‌ కనెక్షన్స్‌ ఉంటే మళ్లీ ధ్రువీకరణ చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ సిమ్‌ కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరించింది. 

Last Updated : Dec 9, 2021, 05:29 PM IST
  • తొమ్మిది 9 కంటే ఎక్కువ సిమ్‌ కనెక్షన్స్‌ ఉంటే మళ్లీ ధ్రువీకరణ

  • వినియోగించని వాటిని డీ యాక్టివేట్‌ చేసుకోవాలి
  • ఆదేశాలు ఇచ్చిన టెలికమ్యూనికేషన్ల శాఖ
SIM cards : మీ దగ్గర 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉన్నాయా... అయితే కనెక్షన్ కట్!

Department of Telecommunications DoT to deactivate extra SIM of subscribers beyond 9 connections: సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ డ్యూయల్ సిమ్ కెపబులిటీ ఉన్న మొబైల్స్ ఉపయోగిస్తుంటారు. దీంతో చాలా మంది కచ్చితంగా రెండు సిమ్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా మనం గతంలో కూడా కొన్ని సిమ్‌లు (SIMs) తీసుకొని ఉండొచ్చు.. లేదంటే మన పేరు మీదే వేరే వాళ్లకి సిమ్‌లు తీసి ఉండొచ్చు.. ఏదై ఏమైనా ఆ లెక్క కాస్త ఎక్కువైతే కనెక్షన్ కట్ (connection cut) చేస్తానంటోంది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ‌‌- డాట్‌ (Department of Telecommunications). అసలు విషయం ఏంటంటే.. మన దేశంలో ఒకే వినియోగదారుడి పేరుపై తొమ్మిది 9 కంటే ఎక్కువ సిమ్‌ కనెక్షన్స్‌ ఉంటే మళ్లీ ధ్రువీకరణ చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ సిమ్‌ కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరించింది. ఒక వినియోగదారుడికి తొమ్మిది కంటే ఎక్కువగా సిమ్ కార్డుల కనెక్షన్‌ ఉంటే వాటిలో ఏ 9 సిమ్ కార్డులను ( 9 SIM connections) కొనసాగిస్తారో తెలుపుతూ... మిగతా వాటిని డీ యాక్టివేట్‌ చేసుకోవాలని డాట్‌ (DoT) పేర్కొంది. 

ఆర్థిక, తదితర నేరాలతో పాటు అవాంఛిత కాల్స్‌కు అరికట్ట వేసేందుకే టెలికమ్యూనికేషన్స్ శాఖ (Department of Telecommunications) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక మళ్లీ ధ్రువీకరణ చేయించుకోకుంటే.. అలాంటి అదనపు సిమ్‌ కనెక్షన్లను డిసెంబరు 7 నుంచి 60 రోజుల్లోగా రద్దు చేయనున్నట్లు తెలిపింది. 

ఒకవేళ వినియోగదారుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మరో 30 రోజుల దాకా అదనపు సమయాన్ని ఇస్తామని పేర్కొంది. గడువులోపు ధ్రువీకరణ చేయించకపోతే..అలాంటి కనెక్షన్లకు అవుట్‌గోయింగ్‌ సదుపాయాన్ని 30 రోజుల్లోపు నిలిపివేయాలని, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ (Incoming calls) సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని టెలికాం ఆపరేట్లను డాట్ ఆదేశించింది. అలాగే ఆయా టెలికాం ఆపరేటర్స్‌ కూడా 9 కంటే ఎక్కువ సిమ్‌కార్డ్స్‌ ఉన్న వినియోగదారులకు నోటిఫికేషన్స్ పంపాలని డాట్ ఆదేశించింది. 

Also Read : Railway New Rules: ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకై రైల్వేశాఖ కొత్త నిబంధనలు

ఇక జమ్మూ అండ్‌ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అసోమ్‌లలో ఈ పరిమితిని ఆరుకు కుదించింది. అక్కడి వినియోగదారులు 6 కంటే ఎక్కు సిమ్‌కార్డు కనెక్షలను కలిగి ఉండకూడదని పేర్కొంది. అయితే తమకున్న కనెక్షన్లలో వేటిని యాక్టివ్‌గా ఉంచుకోవాలి.. వేటిని డీయాక్టివేట్‌ చేయాలనే ఆప్షన్ వినియోగదారులకు ఉంటుంది.

Also Read : Blue Aadhaar Card: బ్లూ ఆధార్‌కార్డు ప్రత్యేకతలేంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News