DRDO New Building: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకు తెలియని చాలా అద్భుతాలు చేస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం మరో అద్భుతం చేసి చూపించింది. కేవలం 45 రోజుల్లో అంత పెద్ద బిల్డింగ్ నిర్మించేసింది. ఆ వివరాలివీ..
డీఆర్డీవో ఏది చేసిన అద్భుతమే. ఏది చేసిన వినూత్నమే. కేవలం రక్షణ రంగానికే కాదు..వ్యవసాయ, ఇతర రంగాలకు కూడా అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం మరో గొప్ప అద్భుతాన్ని చేసి చూపించింది. రికార్డు స్థాయిలో కేవలం 45 రోజుల వ్యవధిలో..ఏకంగా 7 అంతస్థుల భవనాన్ని నిర్మించింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ భారీ భవనం నిర్మించింది. యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేసేందుకు ఈ భవనాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వినియోగించనుంది.
ఈ ప్రాజెక్టును నవంబర్ 22, 2021న శంకుస్థాపన చేయగా..ఫిబ్రవరి1న పనులు ప్రారంభించింది. బెంగళూరు డీఆర్డీవో శాస్త్రవేత్తలు బహుళ అంతస్థుల భవనాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. భారత వైమానిక దళం 5వ తరం విమానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వైమానిక దళం శక్తి సామర్ధ్యాల్ని పెంచేందుకు మధ్యమ స్థాయి, సుదూరం వరకూ ప్రయాణించగలిగే యుద్ధవిమానాల్ని అభివృద్ధి చేసేందుకు ఏఎమ్సీఏ ప్రణాళిక చేపట్టింది. ఈ కార్యక్రమానికి 15 వేల కోట్లు ఖర్చు పెడుతోంది.
ఏఎమ్సిఏ డిజైన్ , మోడల్ అభివృద్ధి కోసం ప్రధాని నేతృత్వంలో ఉన్న రక్షణ వ్యవస్థ అంశాలకు సంబంధించిన సీసీఎస్‌కు అనుమతుల ప్రక్రియ ప్రారంభమైపోయిందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఏఎమ్సీఏ ప్రోజెక్ట్, ఇతర కార్యకలాపాల కోసం కేవలం 45 రోజుల్లో ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఈ ఏడంతుస్థుల భవనాన్ని నిర్మించామని డీఆర్డీవో తెలిపింది.
Rajnath Singh to inaugurate 7-storey complex built in 45 days for 5th gen fighter jet project in Bengaluru
Read @ANI Story | https://t.co/mGxiFIACIX#RajnathSingh #DRDO #FighterJets pic.twitter.com/kAkVJIsTLS
— ANI Digital (@ani_digital) March 17, 2022
ఈ భవనానికి 2021 నవంబర్ 22న శంకుస్థాపన జరిగింది. ఫిబ్రవరి 1న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హైటెక్ టెక్నాలజీతో పూర్తి స్థాయి వసతులతో కూడిన ఈ బిల్డింగ్‌ను డీఆర్డీవో రికార్డు స్థాయిలో కేవలం 45 రోజుల్లో నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి.
Also read: Supreme Court on Hijab Issue: హిజాబ్‌పై విచారణ ప్రారంభించనున్న సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook