Chief Election commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ను నియమించడం వెనక కేంద్రం వ్యూహమిదేనా..

Chief Election commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌​గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని వెనకున్న పెద్ద స్ట్రాటజీ ఇదే.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2025, 05:00 AM IST
Chief Election commission: భారత ప్రధాన ఎన్నికల  కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ను నియమించడం వెనక కేంద్రం వ్యూహమిదేనా..

Chief Election commission: భారత ఎన్నికల ప్రధాన అధికారిగా మాజీ ఐఏఎస్ అదికారైన జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు.  ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో  జ్ఞానేశ్‌ కుమార్‌కు కొత్త ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈసీ చాంబర్‌లో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన జ్ఞానేశ్‌ కుమార్‌ జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు విచారణలను కూడా ఆయన క్రమం తప్పకుండా పర్యవేక్షించారు. వీటితో పాటు కేంద్రంలో బీజేపీ అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అందుకే ఈయనకు ప్రధానమైన ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. జ్ఞానేశ్‌ కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్​ చేశారు. ICFAIలో బిజినెస్ ఫైనాన్స్, యూఎస్‌​లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని HIIDలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదివారు.

2024 జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ సెక్రటరీగా రిటైర్ అయిన జ్ఞానేశ్ 2024 మార్చిలో భాతర్  26వ సీఈసీగా ఎంపికయ్యారు. ఎన్నికల కమిషన్ ఈసీ సభ్యుల నియామకంలో మార్పులు చేసి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామకం పొందిన ఫస్ట్ సీఈసీ జ్ఞానేశ్‌ కుమారే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News