Fire Accident in Prayag raj maha kumbh mela video: కుంభమేళకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 వరకు కొనసాగునుంది. ఇప్పటి వరకు దాదాపుగా.. 39 కోట్ల మంది భక్తులు పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే.. ప్రయాగ్ రాజ్ లో ఇటీవల తరచుగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రయాగ్ రాజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆతర్వాత మౌనీ అమావాస్య రోజున సెక్టార్ 2 ప్రదేశంలో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది చనిపోగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. యోగి సర్కారు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. తాజాగా కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది.
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెకన్ల వ్యవధిలొనే మంటలు టెంట్ అంతట వ్యాపించాయి. ఈ మంటల్లో పదుల సంఖ్యలో టెంట్ లు అగ్నికి ఆహుతి అయ్యిపోయాయి. అగ్ని ప్రమాదం గురించి తెలవడగానే ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
Read more: Maha kumbh Mela: కుంభమేళ నుంచి వెళ్లిపోతున్న అఖాడా నాగ సాధులు.. కారణం ఏంటంటే..?
మంటలు ఇతర ప్రదేశాల్లోకి వ్యాపించకుండా నీళ్లతో అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు చెలరేగిన ప్రాంతంలో ఆకాశం నిండా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరక్కపొవడంతో అక్కడునన్న వాళ్లు ఊపిరీ పీల్చుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter