న్యూఢిల్లీ: కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 స్క్రీనింగ్ ( COVID-19 screening) లేకుండానే భారత్కి రావడం కలకలం సృష్టించింది.
ఎయిర్ ఇండియా విమానం ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే 80 మంది ప్రయాణికులతో భారత్కి బయల్దేరిందని తెలుసుకున్న అధికారులు.. విమానం ఇండియాకు రాకముందే అందులో ప్రయాణికులు, వారు తమ వెంట తీసుకొచ్చే వస్తుసామాగ్రికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించే ఏర్పాట్లు సిద్ధం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే.. విమానాన్ని టీ3 టెర్మినల్లోని నిర్జన ప్రదేశం వెపు తీసుకెళ్లి.. అక్కడే ప్రయాణికులను కిందకు దించారు.
అనంతరం వారిని, వారి లగేజీని పూర్తిగా పరీక్షించిన తర్వాతే వారిని విమానాశ్రయంలోకి రానిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..