దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు , వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
అస్సోం, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వంతెనలు, రోడ్లు సైతం కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ వీడియో వైరల్ అవుతోంది. భయం రేపుతోంది. ఓ వైపు ట్రాఫిక్ వెళ్తుండగానే..పక్కనుంచి భారీగా కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యం భయాందోళనకు గురి చేస్తోంది.
#WATCH Himachal Pradesh: Landslide in Bhattakufer area near Shimla, following heavy rainfall. pic.twitter.com/pQIlW9Qlcl
— ANI (@ANI) July 20, 2020
విరిగిపడుతున్న కొండ చరియలు రోడ్డు పక్కనే ఉన్న చిన్న చిన్న షాపుల్ని ధ్వంసం చేసేశాయి. అదృష్టవశాత్తూ కొండ దిగువన రైలింగ్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. Also read: Kerala: సముద్రం ఆ ఊరిని ఎలా ముంచెత్తుతుందో..