India Alliance: మొన్న ఆప్. రేపు టీఎంసీ. కూటమి నుంచి దాదాపుగా బయటికొచ్చేసినట్టే. బీజేపీకు వ్యతిరేకంగా జత కట్టినా పార్టీల మధ్య సఖ్యత, సర్దుబాటు లోపించింది. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆప్ పక్కనబెడితే..త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ కాంగ్రెస్‌ను వద్దంటోంది. మొత్తానికి ఇండియా బ్లాక్ విఛ్ఛిన్నం దిశగా పయనిస్తోంది.
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బీజేపీకు విజయాన్ని అందించాయి. అంతకుముందు హర్యానా ఎన్నికల్లో తమను కాదనడంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దూరం పెట్టారు కేజ్రీవాల్. ఇద్దరి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా బరిలో దిగి ఓట్లు చీల్చుకున్నారు. అందుకే జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీలో మీరు అలానే కొట్టుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు అదే కూటమిలో మరో పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా బరిలో దిగుతుందని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల విషయంలో ఆప్ , కాంగ్రెస్ మద్య వైరం కారణంగానే బీజేపీ గెలిచిందని చెప్పిన మమతా బెనర్జీ తన రాష్ట్రానికి వచ్చేసరికి అదే పంథా అవలంబించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
కూటమి పార్టీల ప్రకటనలు, విమర్శలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిపై కీలక ప్రకటన చేసింది. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని, అసెంబ్లీ ఎన్నికలకు కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కూడా ఇదే విషయం చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే కూటమి ఏర్పడిందన్నారు. అటు మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ, ఉద్ధవ్ ధాకరే శివసేన, కాంగ్రెస్ మధ్య సంబంధాలు చెడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇండియా కూటమి నుంచి బయటకు రావాలని పరోక్షంగా సంకేతాలిచ్చింది. అదే జరిగితే ఇక ఇండియా కూటమి ఉనికి కోల్పోయినట్టే. దాదాపుగా విఛ్ఛిన్నమైనట్టే.
Also read: Bird Flu Alert: ఏపీలో భారీగా బర్డ్ ఫ్లూ కేసులు.. చికెన్, గుడ్లు తినొచ్చా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి