Nag Mark 2 Missile: భారత సైనిక శక్తికి మరో ఆయుధం, చైనాకు సవాలే

Nag Mark 2 Missile: భారత రక్షణా దళంలో మరో అస్త్రం చేరింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించే నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2025, 04:03 PM IST
Nag Mark 2 Missile: భారత సైనిక శక్తికి మరో ఆయుధం, చైనాకు సవాలే

Nag Mark 2 Missile: భారత రక్షణ వ్యవస్థలో మరో అడుగు ముందుకుపడింది. రాజస్థాన్ పోఖ్రాన్ వేదికగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణి రూపుదిద్దుకుంది. మొత్తం మూడు సార్లు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ క్షిపణి విజయవంతమవడం భారత రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలో ఓ మైలురాయి.

రాజస్థాన్ పోఖాన్ వేదికగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అత్యంత కచ్చితంగా లక్ష్యాన్ని మూడు సార్లు ఛేదించింది. ఈ క్షిపణి మూడో తరానికి చెందిన పైర్ అండ్ ఫర్గెట్ తరహా క్షిపణి. నాగ్ మార్క్ 2 ప్రయోగంతో పాటు క్యారియర్ వెర్షన్ 2 కూడా పరీక్షించారు. ఈ పరీక్షతో నాగ్ వ్యవస్థ మొత్తం భారత ఆర్మీలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్షిపణి ప్రయోగానికి ముందే లాక్ చేసుకోవచ్చు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా కచ్చితంగా టార్గెట్ ఛేదిస్తుంది. పేలుడు రియాక్టర్ ఆర్మర్‌తో పాటు మోడర్న్ ఆర్మర్డ్ నిలువరించేందుకు ఉపయోగపడుతుంది. యుద్ధ ట్యాంకుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. 

నాగ్ మార్క్ 2 క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేసిన మూడవ తరం యాంటీ ట్యాంక్ క్షిపణి. ప్రయోగదశలో అత్యంత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించింది. సరిహద్దుకు ఆవల దూకుడు ప్రదర్శస్తున్న చైనాను నిలువరించేందుకు అద్బతంగా ఉపయోగపడుతుంది. చైనా ఇప్పటికే ఆక్రమిత పాక్‌లో పెద్దఎత్తున రోడ్లు నిర్మించి యుద్ధ ట్యాంకుల్ని తరలించనుంది. 

Also read: AAP Freebies: మహిళలకు నెలకు 2100, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఉచితాల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News