india vs china soldiers : గల్వాన్ లోయ గాయం ఇంకా మానక ముందే భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద డిసెంబర్ 9న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో ఇరు దేశాల నుంచి పులువురు సైనికులకు గాయాలైనట్టు సమాచారం అందుతోంది.
ఘటనకు దారి తీసిన పరిస్థితులు..
అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ విషయంలో భారత్, చైనా మధ్య పలుచోట్ల బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి వాదనల మేరకు వారు తమ వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాస్తూ వస్తున్నారు. 2006 నుంచే ఇరు దేశాల మధ్య ఈ సమస్య ఉంది. ఈ నేపథ్యంలోనే తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ విషయంలోనే భారత్, చైనా బలగాలు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాలకు చెందిన పులువురు సైనికులకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం అందుతోంది. ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల సైనికులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సైనికుల కమాండర్స్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగింది.
తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణ ఘటన 2020 జూన్‌లో లడఖ్‌లోని గల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను గుర్తుచేసింది. ఆనాటి ఘర్షణలో 20 మంది భారత్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సైనికులు సైతం మృతి చెందినట్టు వార్తలొచ్చినప్పటికీ.. ఆ సంఖ్య ఎంతనేది అధికారికంగా వెల్లడి కాలేదు. మొత్తానికి తవాంగ్ సెక్టార్ ఘటన ఇండో-చైనా బార్డర్‌లో వాతావరణాన్ని వేడెక్కించింది.
ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం
ఇది కూడా చదవండి : Pakistan New Army Chief: పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసిమ్ మునీర్
ఇది కూడా చదవండి : China Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం... 36 మంది కార్మికులు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook