Railways New Scheme: ఇండియన్ రైల్వేస్ నుంచి దిమ్మ తిరిగే ప్రకటన రానుంది. డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్గించనుంది. మనం ఇప్పటి వరకూ ఆన్‌లైన్ ఈ కామర్స్ వేదికల్లో చూసే బై నౌ..పే లేటర్ విధానం ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా సరికొత్త సౌకర్యం అందుబాటులో తీసుకురానుంది. త్వరలో బై నౌ పే లేటర్ విధానం ప్రవేశపెట్టనుంది. ఈ విధానంలో ఎలాంటి అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం రానుంది. ఇప్పటికే రైల్వే శాఖ ప్రయాణీకుల సౌకర్యార్ధం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు నిబంధనను ప్రవేశపెడుతోంది. రైల్వే ప్రయాణాన్ని మెరుగ్గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ కొత్త విధానం త్వరలో అందుబాటులో రానుంది. బై నౌ.. పే లేటర్ విధానం ఇది. అడ్వాన్స్ రుసుము చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి తగినంత డబ్బులు లేనప్పుడు ఈ విధానం పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బై నౌ పే లేటర్ విధానం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్ బుక్ చేసిన 14 రోజుల్లోగా సంబంధిత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 14 రోజుల సమయం ఉంటుంది. 14 రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఛార్జ్ ఉండదు.
14 రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే మొత్తం టికెట్ ధరపై 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. అయితే ఈ సౌకర్యం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కే వర్తిస్తుంది. అందుకే టికెట్ బుక్ చేసేటప్పుడు టైమ్ లిమిట్ ఎన్ని రోజులుందనేది చూసుకుని ఆ తేదీలోగా చెల్లించేయాలి.
Also read: Butchaiah Chowdary: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి వద్దు, ఆ పదవి చాలంటూ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి