Terror Attack Plan: ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్ పర్యటన తరువాత అమెరికా వెళ్లి డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మోదీపై హత్యాయత్నం జరిగే అవకాశముందని, ఉగ్రవాదులు ప్లాన్ చేశారనే సమాచారం ఒక్కసారిగా అలర్ట్ చేసింది. సెక్యూరిటీ విభాగం ఉలిక్కిపడింది.
పారిస్‌లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఈ నెల 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్ నుంచి అమెరాకా పర్యటన ఉంటుంది. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో బేటీ అవుతారు. డోనాల్ట్ ట్రంప్‌తో భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్ రక్షణ రంగంలో సహకారం, ఉగ్రవాదం అణచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్ రీజన్ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఇలా విదేశీ పర్యటనలో మోదీ బిజీగా ఉన్న తరుణంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్ర దాడి జరుగుతుందనే సమాచారం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. మోదీ విమానంలో ఉగ్రవాదులు దాడి చేస్తారనే పక్కా సమాచారం తన దగ్గర ఉందంటూ ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో అంతా అలర్ట్ అయ్యారు. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం వేట మొదలెట్టారు. సెకన్ల వ్యవధిలో ఫోన్ కట్ అయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతడిని గుర్తించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తేలడంతో తేలిగ్గా తీసుకున్నారు.
Also read: Valentine Day Offers: స్మార్ట్‌ఫోన్లపై వాలెంటైన్ డే ఆఫర్లు, ప్రేమికులకు గిఫ్ట్ ఇచ్చేందుకు ఇదే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి