ISRO Spadex: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతమైంది. స్పేడెక్స్ మిషన్ అంటే వ్యోమ నౌకల అనుసంధానం. అమెరికా, చైనా, రష్యా తరువాత ఈ ప్రక్రియను విజయవంతంగా ప్రయోగించిన దేశంగా ఖ్యాతినార్జించింది. స్పేడెక్స్ ప్రయోగం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
స్పేడెక్స్ డాకింగ్ అంటే అంతరిక్షంలోని రెండు ఉపగ్రహాల్ని అనుసంధానం చేయడం. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం వాస్తవానికి జనవరి 7న జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో మరింత అధ్యయనం చేసేందుకు జనవరి 9వ తేదీకి వాయిదా పడింది. ఆ తరువాత అనుసంధానం చేయాల్సిన ఉపగ్రహాల మధ్య దూరం అంచనా కంటే అధికంగా ఉండటంతో ఈ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 మీటర్ల నుంచి 225 మీటర్లకు తగ్గించే ప్రయత్నం చేసింది. రెండు సార్లు వాయిదా పడటంతో మూడోసారి రీ షెడ్యూల్ తేదీ ప్రకటించకుండానే ప్రయోగం చేపట్టింది. రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి 3 మీటర్ల వద్ద అనుసంధానం చేశారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాల అనుసంధానం ప్రక్రియను విజయంవంతం చేసినట్టు ఇస్రో వెల్లడించింది. గతంలో అమెరికా, రష్యా, చైనాలు ఈ ప్రయోగం విజయవంతం చేయగా ఇప్పుడు ఐదవ దేశంగా ఇండియా నిలిచింది.
స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఇస్రో PSLV-C60 రాకెట్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) శాటిలైట్లను అంతరిక్షంలో పంపి వాటిని అనుసంధానించారు. రెండు ఉపగ్రహాల్ని ఏకకాలంలో డాకింగ్ చేశారు.
అంతరిక్షంలో పెద్ద పెద్ద నిర్మాణాలు, ఉపగ్రహాల్లో ఇంధనం నింపేందుకు, సపోర్టింగ్ శాంపిల్ రిటర్న్ మిషన్స్, అంతరిక్ష శిధిలాలు తగ్గించేందుకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి సైతం దోహదపడుతుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఒక్కొక్కటి 220 కిలోల బరువుంటాయి. ఇవి భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్షలో తిరిగి అత్యాధునిక సెన్సార్లు, ఆల్గారిథమ్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.