Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..

Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్ని బైటపెట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 5, 2024, 10:30 AM IST
  • కోల్ కతాలో కొనసాగుతున్న నిరసనలు..
  • మమతా సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకత..
 Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..

Kolkata doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర ఘటన దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 8 న జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా సుప్రీంకోర్ట్ సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఇప్పటికే కీలక నిందితుడు సంజయ్ రాయ్ తోపాటు, మరో ఏడుగురిని సైతం అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఇటీవల ఆర్ జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్స్ పాల్.. సందీప్ ఘోష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోల్ కతా ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీనిపై కోల్ కతా సర్కారును ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం.. మమతా సర్కారును తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాకుండా.. దీనిపై రోజుకో ట్విస్ట్ లు వెలుగులోకి చోటు చేసుకుంటున్నాయి. ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని  అప్పగించేటప్పుడు పోలీసులు ప్రవర్తించిన షాకింగ్ ప్రవర్తన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు..Heavy floods: బురదలో ఫుడ్ ప్యాకెట్ల కోసం పోట్లాట.. వైరల్ గా మారిన హృదయ విదారక దృశ్యాలు.. వీడియో వైరల్..

ఆగస్టు 8 ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటన దేశంలొ పెనుదుమారంగా మారిన విషయం తెలసిందే. ఈ ఘటనలో ఆర్ జీ కర్ ఆస్పత్రిలో.. సెమినార్ హాల్ లో.. రక్తపు మడుగులో, విగతజీవిగా పడిపోయి ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్ కర్ ఆస్పత్రి సిబ్బంది యువతి.. తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ లు కూడా చేశారు. అంతేకాకుండా.. ఒక సారి ట్రైనీ డాక్టర్ కు హెల్త్ బాగాలేదని, మరోసారి సీరియస్ గా ఉందని, ఇంకొసారి యువతి చనిపోయి ఉందని కూడా అనేక విధాలుగా అనుమానస్పదంగా వచ్చేలా చేశారు.

అంతేకాకుండా.. దీనిపై  కూడా అనేక అనుమానాలు బైటపడ్డాయి. ఇదిలా  ఉండగా.. కోల్ కతా లో నిరసనలు తెలియజేస్తున్న.. కొంత మంది నిరసన కారుల పట్ల పోలీసులు కూడా గతంలో వాటర్ కెన్స్ , భాష్పవాయువు గోళాలతో సైతం దాడులు జరిపారు. దీనిపైన కూడా రచ్చనెలకొంది. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

Read more: Pushpa 2: ఇదేంపైత్యం రా నాయన.. ‘పుష్ప-శ్రీవల్లీ’ వినాయకుడంటా.. చూశారా..?

ఆగస్టు 9 తేదీన తమకు  మృతదేహాం అప్పగించేటప్పుడు.. ఒక సీనియర్ పోలీసు అధికారి లంచంలో ఇచ్చేందుకు ప్రయత్నించాడని కూడా చెప్పారు. ఈ విషయాన్ని పెద్దది చేయోద్దని వారు అన్నట్లు కూడా, ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ,  రాష్ట్రపటి ద్రౌపది  ముర్ము సైతం స్పందించి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News