Kolkata rape and muder case update: కోల్ కతా కేసులో ఈ రోజు ఏవిధంగా తీర్పు వెలువడుతుందొ అని దేశమంత సర్వత్రా ఉత్కంఠగ ఎదురు చూస్తుంది. శనివారం కోల్ కతా కోర్టు సంజయ్ రాయ్ ను దోషిగా తెల్చింది. సంజయ్ రాయ్.. జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి, హతమార్చినట్లు సీబీఐ దాఖలు చేసిన ఆధారాలను చూసి కోర్టు దోషిగా తెల్చింది. ఈ క్రమంలో శిక్ష తీర్పును మాత్రం.. ఈరోజుకు (సోమవారం) వాయిదా వేసింది.
ఈరోజు మరల పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ ను న్యాయస్థానంలో హజరుపర్చారు. దీనిలో భాగంగా.. జడ్జీ ముందు నిందితుడు సంజయ్ రాయ్ మళ్లీ వివాదాస్పదంగా తన వాదన విన్పించాడు. తనను అక్రమంగా ఈకేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. తనతో తెల్లని పేపర్ మీద సంతాకాలు చేసుకున్నారని సంజయ్ రాయ్ తన వాదనలు విన్పించాడు.
అంతే కాకుండా.. తాను మెడలో రుద్రాక్షలు ధరిస్తానని ఒక వేళ నేరం చేసి ఉంటే.. ఘటన చేసి ఉంటే.. అవి సెమినార్ లో పడిపోయి కన్పించేవని అన్నాడు. ఈ క్రమంలో కోర్టు వారు.. సంజయ్ రాయ్ ను.. నిన్ను జైలులో కుటుంబ సభ్యులు ఎవరైన వచ్చారా.. అని ప్రశ్నించారు. దీనికి .. ఎవరు రాలేదని సంజయ్ రాయ్ బదులిచ్చాడు. అయితే.. ఈ ఘటన జరిగాక అనేక ఆధారాలను ధ్వంసం చేశారని.. తనను అక్రమంగా ఇరికించారని సంజయ్ రాయ్ వాదనలు విన్పించాడు.
దీంతో ఏసీబీ తరపు లాయర్ వాదనలు విన్పిస్తు.. ఇది చాలా అరుదైన కేసు అని.. ఇప్పటికే సీబీఐ ఘటన జరిగాక..ప్రతి ఒక్క ఆధారాలను, ఫోరెన్సిక్ రిపోర్ట్ ను సైతం కోర్దు వారి ముందు ఉంచిందని.. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పారు. జూనియర్ డాక్టర్ గొప్ప ఆశయాలతో, ప్రజలకు సేవ చేయాలని మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చిందని.. ఆమెను అత్యంత దారుణంగా సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత మార్చాడని వాదించాడు. ఇతడికి కఠినంగా శిక్ష విధించి సమాజానికి న్యాయవ్యవస్థ మీద విశ్వాసం పెరిగేలా చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పు కోసం దేశమంత ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter