Weather Updates LIVE: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం-దక్షిణ ఒడిస్సా తీరంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఒడిశా సహా మరో 6 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. గుజరాత్, మహారాష్ట్రల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబయి, రాయ్‌గఢ్, రత్నగిరి, పూణే జిల్లాలతో పాటు వచ్చే మూడు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
ఇక కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే జులై 24వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. "రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం సెలవులు ఉంటాయి.." అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.