Magha Punnami: మాఘ పౌర్ణమి.. మహాకుంభమేళా ప్రత్యేకతలు ఇవే..

Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్​రాజ్​ ను... నో వెహికల్ జోన్’​గా ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2025, 01:01 PM IST
Magha Punnami: మాఘ పౌర్ణమి.. మహాకుంభమేళా ప్రత్యేకతలు ఇవే..

Magha Punnami 2025: మహా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ కు   కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ కు ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు స్పెషల్ ట్రాఫిక్ ప్లాన్​ ను  రూపొందించారు. ఎంతో పవిత్రమైన మాఘ పౌర్ణమి కావడంతో  తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు  గంగ, యుమనా, సరస్వతిల పవిత్రమ సంగమ స్థానంలో  పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ త్రివేణీ సంగమానికి మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ స్నానాలు రోజంతా కొనసాగుతాయన్నారు. సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు దీక్ష విరమిస్తారని చెప్పారు. కాగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులపై హెలికాప్టర్‌ ద్వారా పుష్ప వర్షం కురిపించారు.

మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కారు. ఇప్పటికే ప్రయాగ్​రాజ్ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలన్నీ నిండిపోయాయి. మరిన్ని వెహికల్స్​ ను సిటీలోకి అనుమతిస్తే నడుచుకుంటూ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారు. సాధువులంతా తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే స్నానం చేయాలని అధికారులు సూచించారు. పుణ్య స్నానం ఆచరించిన  వెంటనే ఘాట్ లను వెంటనే ఖాళీ చేయాలని కోరారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించేలా స్పెషల్ రూట్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రయాగ్​ రాజ్ వాసులకు అధికారులు సూచించారు. ఆన్​ లైన్ మోడ్​లోనే పాఠాలు బోధించాలని స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు అధికారులు ఆదేశించారు. కాగా, జబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్​లో సుమారు 350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 50 కిలో మీటర్ల జర్నీకి సుమారు 12 గంటలకు పైగా టైమ్ పడుతున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ త్రివేణి సంగమంలో మంగళవారం పుణ్య స్నానం ఆచరించారు. ఆయన తల్లి కోకిలాబెన్ అంబానీ కూడా కుంభమేళాకు వచ్చారు. ముఖేశ్ అంబానీ కొడుకులు అనంత్, ఆకాశ్ హాజరయ్యారు. ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా, ఇద్దరు పిల్లలు పృథ్వి, వేద కూడా పుణ్య స్నానమాచరించారు. నాలుగు తరాలకు చెందిన అంబానీ ఫ్యామిలీ మొత్తం త్రివేణి సంగమానికి వచ్చింది. భారీ భద్రత మధ్య అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడ గంగామాత, సూర్య భగవానుడికి పూజచేసి పుణ్య స్నానమాచరించారు.

మహాకుంభమేళా ప్రారంభమై నేటికి 31 రోజులు అయ్యింది. జనవరి 13న ప్రారంభమైన మేళా.. మహా శివరాత్రితో ముగియనుంది. ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల  భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని  సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News