గుజరాత్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్  పాలకులపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు మీ హయాంలో భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఆయన కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించారు. భారత రాజ్యాంగ నిర్మాతలైన అంబేద్కర్, పటేల్‌లకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందనే విషయాన్ని ఆ పార్టీ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

‘‘అంబేద్కర్ చనిపోయిన 34 సంవత్సరాల తర్వాత ఆయనకు భారతరత్న ప్రకటించడం ఎంత సిగ్గుచేటు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం ఒకే ఒక్క కుటుంబం కారణంగా.. కుటుంబ రాజకీయాలనేవి మన దేశంలోకి చొచ్చుకువచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో జవహర్‌లాల్ నెహ్రూకి ఎంత పేరున్నా, అంబేద్కర్ విషయంలో తాను చేసిందేమీ లేదు. రాజ్యాంగ పరిషత్తులో చోటు కోసం డాక్టర్ అంబేద్కర్ తనవంతుగా చాలా కష్టపడ్డారు.’’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

English Title: 
Narendra modi comments on Ambedkar's Bharata Ratna
News Source: 
Home Title: 

అంబేద్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు

అంబేద్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు: కాంగ్రెస్ పై మోదీ ఫైర్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes

Trending News